గీతం యూనివర్శిటీ ఆక్రమించిన ప్రభుత్వ స్థలంలో రెవిన్యూ అధికారులు శుక్రవారం పక్కాగా కంచెవేశారు. జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఆదేశాల మేరకు ఆర్డీఓ భాస్కరరెడ్డి పోలీసుల సిబ్బంది సహకారంతో సర్వేనెంబరు 37, 38 ప్రభుత్వ భూముల్లో ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిగా ఉన్న ఇక్కడ గతంలో ఫెన్సింగ్ లేదు. ఇపుడు 5.72 ఎకరాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్టు ఆర్డీఓ మీడియాకి వెల్లడించారు. మొత్తం 14 ఎకరాల 62 సెంట్లు ప్రభుత్వ భూమి ఉండగా ప్రభుత్వ భూములకు కేవలం పెన్సింగ్ మాత్రమే వేశామన్నారు. ఒక వైపు మాత్రమే ఫెన్సింగ్ వేశామని రెండవ వైపు ప్రభుత్వ భూమి ఉన్నదన్నారు. కోర్టు పరిశీలనలో 40
ఎకరాల్లో వుంది. ప్రస్తుతం దానిజోలికి వెళ్లలేదని పేర్నొ్న్నారు. కాగా ప్రభుత్వ పనులన్నీ తెల్లవారుజామునే చేస్తామని. ఆ క్రమంలోనే ఈరోజు ఉదయం పనిపూర్తిచేశామన్నారు. ఉదయం అయితేనే కార్మికులు అలసిపోకుండా పని సులువు అవుతుందని ఆర్డీఓ మీడియాకి వివరించారు.