ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదిన నిర్వహించబోయే గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిఆర్వో జి. నరశింహు లు సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఏపిపిఎస్ ఎగ్జామ్స్ నిర్వహణ పై సర్వీఎస్ కమీషన్ అధికారులు, లైజనింగ్ అధికారులు, ఛీఫ్ సూపరింటెండెంట్లుతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఈ సందర్బంగా డిఆర్వో మాట్లాడుతూ, జిల్లాలో 342 పరీక్షా కేంద్రాల్లో 7946 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారన్నారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పేపరు-1 తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుందన్నారు. ఉదయం జరిగే పరీక్షకు ఉ. 9.45లోపు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు మ. 1.45 లోపు అభ్యర్ధులు ఖచ్చితంగా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు.