గ్రూప్-I పరీక్షలు నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎపిపిఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-I పరీక్షలు ఈ నెల 8న జరుగుతున్న పరీక్షలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 5600 మంది అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారన్నారు. లైజన్ ఆఫీసర్లు గా సీనియర్ జిల్లా అధికారులను నియామకం చేశామన్నారు. పరీక్షాలను సందర్శించిన ప్రాంతాల్లో సమస్యలను లైజన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష ఉదయం 10 గంటలు నుండి 12 వరకు, మధ్యాహ్నం 2 నుండి 4 వరకు జరుగు తుందన్నారు. పరీక్ష కేంద్రాలు వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారుల ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎస్పీ మహేంద్ర, ఎపిపిఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు ప్రశాంత్ పాల్గొన్నారు.