రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను ఎంతో నిజాయతీగా, నిస్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ అందిస్తూ వారికి ఆర్థికంగా భరోసాను అందిస్తున్నారని పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎం.పి భరత్ రామ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిళ, మున్సిపల్ కమీషన కె. దినేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర మున్సిపల్ అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపి. భరత్ రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ ప్రాంతంలో నూతనంగా 1324 మంది లబ్దిదారులుకు పెన్షన్లు అందించగా ఇప్పటి వరకు 29917 మంది లబ్దిదారులుకు రూ. 8,36,16,750 రూపాయలు పెన్షన్ అందిస్తున్నామన్నారు.
అర్హత ఉన్న ప్రతి వానికి ఫింఛను అందించాలన్నదే ప్రభుత్వ నిర్ణయం అన్నారు. గతంలో 39 లక్షల మందికి వెయ్యి రూపాయలు చొప్పన అందించే వారని అదికూడా ఎండనక, వాననక క్యూలైన్లో నుంచో వలసిన పరిస్థిలు ఉండేవన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అర్హతే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పేదవానికి ఫించను అందించగా నేడు రాష్ట్రంలో 64.64 లక్షల మందికి ఫించన్లు అందిస్తూ వారికి ఆర్థిక భరోసాను కల్పించారన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే ప్రతి ప్రక్షాలు పెన్షన్లు తీసేస్తారనే దుష్పప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా అర్హులైన పలువురికి పెన్షన్లు పంపిణీ చేసారు.
మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ అర్హులై ఉండి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తునామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు నగరంలో వారం రోజులు పాటి పింఛను కానుక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అర్హత ఉన్న వారేవరు పింఛను రాలేదని బయపడనవసరం లేదని, సంవత్సరంలో ప్రతి ఆరుమాసాలకు ఒకసారి జూన్, డిసెంబరు మాసాల్లో అర్హులను గుర్తించి ఫింఛను అందిస్తామన్నారు.
నూతనంగా మంజూరు అయిన వారందరికీ ఈ వారం రోజులు పాటు కార్యక్రమాలు నిర్వహించి వారికి పెన్షన్ అందిస్తామన్నారు. రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా అర్హులైన ప్రతి పేదవానికి పెన్షన్ మంజూరు చేస్తున్నారన్నారు. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ప్రభుత్వం కార్యాలయాలు చుట్టూ నాలుగైదు రోజులు తిరగాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. నేడు అటువంటి పరిస్థిలు లేకుండా 1 వ తేదీ తెల్లవారు ఝూమునే వాలంటీరీ వచ్చి తలుపు తట్టి మరీ పెన్షన్ అందిస్తున్నారన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలన్నదే సీయం లక్ష్యం అన్నారు. విద్యాభివృద్ది ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఇందులో భాగంగా ఫీజురియంబర్స్ మెంట్, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన్ వంటి అనేక పథకాలను ప్రభుత్వం అమల చేస్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అడపా శ్రీహరి, వార్డు కార్యదర్శులు, వార్డు ఇన్చార్జులు, పెన్షన్ నూతనంగా మంజూరు లైన పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు.