స్టీల్‌ప్లాంట్‌ సీఎండీతో ఐఎస్‌టీడీ బృందం భేటీ


Ens Balu
18
Gajuwaka
2023-01-07 10:25:49

వైజాగ్‌ స్టీల్‌ సీఎండీ, ఐఎస్‌టీడీ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ అతుల్‌ భట్‌తో విశాఖపట్నం చాప్టర్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు(ఐఎస్‌టీడీ) సభ్యులు శనివారం భేటీ అయ్యారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హెచ్‌ఆర్‌ నిపుణుల ప్రయోజనం కోసం ఆర్‌ఐఎన్‌ఎల్‌తో కలిసి నిర్వహించగల కార్యక్రమాలపై చర్చించారు. త్రైమాసిక మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు, ఇతర హెచ్‌ఆర్‌ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించాలని చాప్టర్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఓఆర్‌ఎం.రావు ప్రతిపాదించారు. ఎండీపీలకు సంబంధించిన అంశాలు, కార్యకలాపాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణ ప్రణాళిక గురించి సలహా ఇచ్చేందుకు ఆర్‌ఐఎన్‌ఎల్‌లో ఎంసీ సభ్యుల కోసం సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా సీఎండీని అభ్యర్థించారు. ఐఎస్‌టీడీ గౌరవ కార్యదర్శి డాక్టర్‌ హేమ యడవల్లి విశాఖపట్నం చాప్టర్‌ ద్వారా ఈ-జర్నల్‌ను ప్రారంభించడం గురించి వివరించారు. జర్నల్‌ మొదటి సంచికకు సందేశం ఇవ్వాలని ఆమె అభ్యర్థించగా సీఎండీ దానికి అంగీకరించారు. కార్యక్రమంలో ఐఎస్టీడీ ప్రతినిధులు పాల్గొన్నారు.