అంకిత భావంతో విధులు నిర్వహించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. శ్రీకాకుళం రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తు మరణించిన 12 మంది ఉద్యోగుల కుటుంబాల సభ్యులకు జిల్లాలో సచివాలయాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తూ సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధుల పై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో అందజేయాలని హితవు పలికారు. ఈ నియామక పత్రాల పంపిణి కార్యక్రమంలో ఆర్.టి.సి, ఆర్.ఎం ఎ.విజయ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరీ, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకట్ రామన్, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయదేవి, తదితరులు పాల్గొన్నారు.