ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సహాయ నిధికి ఉపాది హామీ పథకం భీమవరం క్లస్టర్ తరపున రూ.1.67లక్షలు నిధి సమకూరిందని డ్వామా పీడీ ఎస్టీవి రాజేశ్వర్రావు తెలియజేశారు. ఈ మొత్తాన్ని భీమవరం క్లస్టర్ ఎపిడి వి. విజయ లక్ష్మి, ఇ. సి కె. శ్రీనివాస్, జె.ఇ ఆనంద్ వివిధ మండలాల టి.ఏ లు,సి.ఓ లు ద్వామ సిబ్బంది డ్వామా పీడి అందచేశారు. ఇటీవల తణుకు క్లస్టర్ మండలాల సిబ్బంది అందచేసిన రూ:67,000/- తో కలిపి రూ:1,67,000/- మొత్తాన్ని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ కి అందజేయనున్నట్టు డ్వామా పీడీ తెలియజేశారు.