ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా వుండాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ మేరకు జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమంలో ప్రజారోగ్య భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్ లో ఉత్తమ వైద్య సేవలు అందచేసిన వైద్యులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా.కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం క్రింద గర్భిణీ, బాలింతలు, ధీర్ఘకాలికా వ్యాధులతో బాధపడే వారు, ఆరోగ్యశ్రీ, శస్త్ర చికిత్సల రోగులకు , స్కూల్ మరియు అంగన్వాడీ స్కూల్ లో ఆరోగ్య పరీక్షలు చేసి ఉత్తమ వైద్య సేవలు అందించిన 5గురు వైద్యులను సన్మానించామన్నారు.
జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా కోరుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా.రవిచంద్ర, సీతానగరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా. రాజు, కల్లవాలపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా.సౌజన్య, డా.అవినాష్ మరియు దోసకాయలపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా. ఈషా జ్యోతి లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. కే. వెంకటేశ్వర్రావు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి, డా. ఎన్ వసుందర , వైద్యులు డా.మౌనిక, డా.అబిషేక్, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.