పౌర సరఫరాల శాఖ సమీకృత టోల్ ఫ్రీ నెంబరు1967


Ens Balu
20
Parvathipuram
2023-01-10 07:05:40

పౌర సరఫరాల శాఖ అంశాలకు సంబంధించి విజయవాడలో సమీకృత కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారని పార్వతీపురం మన్యం జిల్లా జెసి ఓ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. కాల్ సెంటర్ లో 10 మంది కాల్ సెంటర్ ఎక్జిక్యూటివ్ లు ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాల్ సెంటర్ మంగళ వారం నుండే పని చేయడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్), ధాన్యం కొనుగోలు, తూనికలు - కొలతలు, వినియోగదారుల రక్షణ తదితర పౌర సరఫరాల సంబంధ అంశాల పట్ల సమస్యలను పరిష్కరిస్తుందని, అవసరమగు సమాచారం అందిస్తుందని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ సేవలను ప్రజలు వినియోగించు కోవాలని ఆయన కోరారు.