అనకాపల్లి జిల్లాలోని ఆరోగ్యశాఖ అధికారుల సంఘం క్యాలెండర్ ను మంగళవారం డిఎంఅండ్ హెచ్ఓ డా.ఏ.హేమంత్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, ప్రజా సేవలో కూడా ఈవిధంగా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విద్య, మీడియా అధికారుల సంఘం 2023 కేలండర్ను ఇటీవలే ముద్రించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కెవి. జ్యోతి, పి.స తీష్, బి.భాస్కరరావు, డి.ఝాన్సీ రాణి, చంద్రదేఖర్, అబ్బుల్ రషీద్, ఎమ్మెస్వీ.ప్రసాద్, జిల్లా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.