గణతంత్రదినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అమలాపు రం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోజిల్లా అధికారుల తో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, స్థానిక బాలయోగి స్టేడియం నందు జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు చేపట్ట వలసి న ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ పెరేడ్ మైదానాన్ని, వేదికను స్థానిక ఆర్డిఓ పురపాలక సంఘ అధికారులు సిద్ధం చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగం, సాంప్రదాయ కవాతు దళాలను వివిధ కంపార్ట్మెంట్ల వద్ద శాంతిభద్రతలు బందోభస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. వేదిక, గ్యాలరీలను సుందరీకరించాలని కోరారు.
సిపిఓ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖల సమన్వయంతో జిల్లా ప్రగతి సమాచారంతో ప్రసంగం తయారు చేసి ముఖ్య అతిథులకు ముందు గానే అందజేయాలని మీడియాకు ఆహ్వానం పంపాలని డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబును ఆదేశించారు. వేడుకలలో వివిధ ప్రభుత్వ శాఖలు తమ తమ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల సమాచారంతో శకటాలను, సుందరంగా తయారుచేయాలని శకటాల పర్యవేక్షణకు ప్రోటోకాల్ పాటించేందుకు లైజన్ అధికారిని నియమించామన్నారు. గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా విధినిర్వహణ లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులను సత్కరించేందుకు శాఖల వారీగా నిర్థేశిత నమూనాలో ప్రతిపాదన లను ఈ నెల 20వ తేదీ లోపున సమర్పించాలని తెలిపారు.
ఈ సమావేశంలో , ఎఎస్పి కె లతామాధురి, ఆర్డిఓ వసంత రాయుడు, డిపిఓ, కృష్ణకుమారి , సిపిఓ వెంకటేశ్వర్లు, ఈ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే నాగేశ్వరరావు ఉద్యాన అధికారి ఎన్ మల్లికార్జునరావు, డి సి హెచ్ ఎస్ పద్మశ్రీ రాణి,వివిధ శాఖల జిల్లా సాయి అధికారులు పాల్గొన్నారు.