వివేకానంద మాట-బాట మనందరికీ ఆదర్శం


Ens Balu
37
Srikakulam
2023-01-12 10:20:27

స్వామి వివేకానంద చెప్పిన మాట, ఆయన నడిచిన బాట మనందరికీ ఆదర్శమని, ముఖ్యంగా యువత ఆ దిశగా నడవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా గురువారం సూర్యమహల్ కూడలి వద్ద  వివేకానంద విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  స్వామి వివేకానంద జయంతిని దేశవ్యాప్తంగా నేడు జరుపుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అతి చిన్న వయసులో పెద్ద సందేశాన్ని మనకు అందించిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. నరేంద్ర నాథ్ దత్త అనే పేరు బహుశా చాలామందికి తెలియకపోవచ్చు కాని వివేకానందగా ప్రపంచం మొత్తం ఆయనను గుర్తిస్తారని తెలిపారు. చాలా చిన్నవయసు నుండి స్వాభిమానం, దేశభక్తి ఉన్న ఆయన నిస్వార్ధ భావనతో ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం యువత ఎలా కష్టపడాలన్న సందేశాన్ని మనకు అందించారని అన్నారు. ఆయన మాటలు మనందరికీ స్పూర్తిగా ఉంటాయని,  స్వామి వివేకానంద మాట, బాట మనందరికీ ఆదర్శమని, ఆ దిశగా యువత ముందుకుసాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.