అనంతలో 5వ రోజు ఉదయం 71.96% హాజరు..
Ens Balu
0
Anantapur
2020-09-24 13:09:00
అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగాల భర్తీ కొరకు చేపట్టిన 5వ రోజు నిర్వహించిన రాత పరీక్షల్లో 71.96 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురు వారం అనంత నగరం ప్రధాన కేంద్రం లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కేటగిరి - 3 వార్డు ప్లానింగ్ మరియు రేగులేషన్ సెక్రెటరీ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు 1070 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 770 మంది హాజరయ్యారు, 300 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరుకాగా , 71.96 శాతం హాజరు అయ్యారు. అనంతపురం ప్రధాన కేంద్రం లోని 6 పరీక్ష కేంద్రాల్లో ఐదవ రోజు పరీక్ష జరిగింది. అభ్యర్ధులకు పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మీడియాకి వివరించారు. 26వ తేది వరకూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు.