అరసవిల్లి రథసప్తమికి విఐపిలకు రూ.500తో పాసులు


Ens Balu
13
Arasavilli
2023-01-22 17:09:33

ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి ఉత్సవాల్లో  విఐపిలకు ప్రత్యేకంగా రూ.500 పాసులను అందుబాటులోకి తీసుకొచ్చిన్టటు ఈవో వి.హరి సూర్య ప్రకాష్ ప్రకటించారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ పాసులను అరసవల్లి యూనియన్ బ్యాంక్ లో రూ.500 చెల్లించి పొందవచ్చనన్నారు. ఈ పాసులను శ్రీకాకుళం ఆర్డిఓ  బి.శాంతి అనుమతి పత్రం పొందిన వారికి మాత్రమే అందజేస్తారని.. ఒక్కో విఐపి టిక్కెట్ తో ఇద్దరకు మాత్రమే అనుమాతిస్తారని పేర్కొ్న్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో డోనార్ పాసులు పంపిణీ జరుగుతుందన్నారు. అదే రోజు ఆలయ దాతలకు  ఆలయ కార్యాలయం వద్ద అందజేస్తామన్నారు. ఈ నెల 26సాయంత్రం లోపు రూ.లక్ష  రూపాయలు వరకు విరాళాలు ఇచ్చిన వారి నుంచి   స్వీకరించేందుకు అవకాశం ఇస్తున్నామని ఇలా ఇచ్చే దాతలకు కూడా డోనార్ పాసులను అందజేస్తామన్నారు. అలాగే ఈనెల 23నుండి ఇంతవరకు ఆలయంలో విరాళాలు ఇచ్చిన దాతలకు ఆలయ సిబ్బంది ద్వారా ఫోన్లో దాతల పాసులకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని తెలియజేశారు. నేరుగా దాతలు వారి అనుమతి తో వచ్చిన సంబంధికులుకు మాత్రమె డోనార్ పాసులను అందజేస్తామని ఈవో స్పష్టం చేశారు.