కోవిడ్ నిబంధనలతో పోలిసెట్..


Ens Balu
2
Vizianagaram
2020-09-24 14:23:55

విజయనగరం జిల్లాలో  ఈ నెల 27 వ తేదీన నిర్వహించనున్న  పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ను కోవిడ్ నిబందనలతో నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఎం. గణపతి రావు అధికారులకు ఆదేశించారు. గురువారం పోలిసెట్ పరీక్ష ఏర్పాట్ల పై  సంబంధిత అధికారులతో  సమావేశం నిర్వహించి పలు సూచనలను చేసారు. పరీక్షను ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్ధులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి హాజరు కావలసి ఉంటుందని అన్నారు. ప్రతి కేంద్రం వద్ద ప్రతి అభ్యర్ధికి ధర్మల్ స్కానర్ ద్వరా శరీర ఉష్ణోగ్రత ను పరీక్షించాలని, జ్వరం ఉన్న వారి వివరాలను వైద్య సిబ్బందికి తెలిజేయాలని అన్నారు. జ్వరం, కోవిడ్ ఉన్న అభ్యర్ధులకు ప్రత్యెక  గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద సానిటైజర్ తప్పక ఉంచాలని, ప్రతి ఒక్కరు మాస్క్ వినియోగించేలా చుడాలని అన్నారు.          జిల్లాలో 29 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు,  మొత్తం 6887 మంది అభ్యర్ధులు హాజరు కానున్నట్లు  తెలిపారు.   ప్రతి కేంద్రం వద్ద త్రాగు నీరు, నిరంతర విద్యుత్ సరఫరా, మందులతో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయా అధికారులకు ఆదేశించారు. అన్ని కేంద్రాలకు బస్సు లను నడపాలని, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని తెలిపారు.   ఉదయం 11 నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్న ప్రాంతాల్లో జెరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా సంబంధిత తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించేలా సమన్వయం తో పని చేయాలన్నారు. ఈ సమావేశం లో ఆర్ టి సి జిల్లా మేనేజర్ ఎన్. బాపి రాజు, అదనపు వైద్యాధికారి డా. రవి కుమార్, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పోలీస్, రెవిన్యూ శాఖల అధికారులు హాజరైనారు.