ప్రధాన మంత్రి టి.బి.ముక్తా భారత్ అభియాన్ క్రింద డా.రెడ్డీస్ లేబరేటరీస్ జిల్లాలో 595 మంది టి.బి వ్యాధి గ్రాస్థులకు ఫుడ్ బాస్కెట్ నెలకు రూ.700/-లు చొప్పున 6 నెలలపాటు అందజేయు నిమిత్తం 25 లక్షల రూపాయల చెక్కును జిల్లా టి. బి. కొంట్రోల్ అధికారిణి డా. అనురాధ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జెసి ఎం. నవీన్, డీఆర్వో రాజేశ్వరి, డా.రెడ్డీస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ బి. సురేష్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్,జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకట్ రామన్, డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు, డీపీఓ రవికుమార్, డి.ఎస్.ఓ వెంకట రమణ, అగ్రీ ఏడీ శ్రీధర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.