ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆధార్ లో మార్పులు చేర్పులు చేసుకోవటానికి కలక్టరేట్ లో నేటి నుండి3రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు్న్నట్టు
జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున తెలియజేశారు. ఈ కేంద్రాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధార్ ప్రత్యేక డ్రైవ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్
కె.యస్.విశ్వనాథన్ ప్రారంభించారు. ప్రభుత్వం ఆధార్ లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించినందున ప్రతీ ఉద్యోగి మార్పులను నమోదు చేసుకోవాలని
జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాశాఖల సిబ్బందికీ ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు.