ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులందరూ ముఖ ఆధారిత హాజరు యాప్ నందు తమ వివరాలు నమోదు చేసుకొని, ప్రతిరోజు తప్పకుండా ఆ యాప్ నందు
హాజరు వేయాలని విశాఖజిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్
వినియోగంపై దిశా నిర్దేశం చేశారు.. ప్రతి శాఖ విభాగాధిపతులు ఉద్యోగుల యొక్క హాజరు వివరాలను యాప్ నందు నమోదు చేసేటట్లు చూడాలని ఆదేశించారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతీరోజూ మూడు సార్లు హాజరు నమోదు చేయాల్సిందేనన్నారు. ఎవరికీ మినహాయింపులు లేవన్నారు.