విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్సజెండర్స్, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులుగా జె.మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె
విశాఖజిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జునను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమె ఇటీవలే డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. విధుల్లోకి చేరిన
అనంతరం కలెక్టర్ ను కలిసి పరిచియం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లిఖార్జున మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు పెద్ద పీట
వేయాలని, సంక్షేమ కార్యక్రమాలు విభిన్న ప్రతిభావంతులకు సక్రమంగా అందేలా చూడాలన్నారు.