సచివాలయ నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి..
Ens Balu
2
జామి సచివాలయం
2020-09-24 15:44:40
విజయనగరం జిల్లాలోని ఉపాధిహామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో చేపట్టిన ప్రభుత్వ సచివాలయ భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జామి, వేపాడ మండలాల్లో జె.సి. వెంకటరావు గురువారం పర్యటించారు. జామి మండలం భీమసింగిలో నిర్మాణంలో వున్న గ్రామ సచివాలయ భవనాన్ని డ్వామా పి.డి. నాగేశ్వరరావుతో కలసి పరిశీలించి, నిర్మాణ ప్రగతిపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. సిమెంటు సరఫరా సమస్యలు, చెల్లింపుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జామి మండల తహశీల్దార్ కార్యాలయంలో జమాబందీ నిర్వహించి కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. రెవిన్యూ సంబంధ సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం వేపాడ మండలంలో పర్యటించారు. వేపాడ మండల కేంద్రంలో నిర్మాణంలో వున్న గ్రామ సచివాలయ భవనాన్ని, రైతుభరోసా కేంద్ర భవనాన్ని డ్వామా పి.డి., నాగేశ్వరరావు, జె.సి.వెంకటరావు కలసి పరిశీలించారు. వల్లంపూడి, అతవ గ్రామాల్లో రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్, గ్రామ సచివాలయాల నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు.