జనవరి 25, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ ఆడిటోరియంలో బుధవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంచూరియన్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ డా. జి.ఎస్.ఎన్. రాజు హాజరుకానున్నారని పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 1.00 గంటకు కార్యక్రమం ప్రారంభమవుతుందని దీనిలో భాగంగా ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సందేశాన్ని మైక్ ద్వారా సభికులకు వినిపిస్తామని వివరించారు.