జాతీయ 13వ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ సుమ్మరి రివిజన్-2023లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఉత్తమ విధానాలు అవలంబించిన అధికారులకు అవార్డ్స్ ప్రకటించింది. యువ ఓటర్ల నమోదు ఓటరు జాబితా సవరణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ కి జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున ఎన్నికయ్యారు. ఈనెల 25న విజయవాడ లో తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా జరుగు జాతీయ ఓటరు దినోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఈ అవార్డు కలెక్టర్ కు ప్రధానం చేస్తారు. అదేవిధంగా గాజువాక నియోజక వర్గం ఎన్నికల నమోదు అధికారి డి. లక్ష్మారెడ్డి, ఉత్తమ ఎన్నికల నమోదు అధికారిగా, గాజువాక పోలింగ్ కేంద్రం నెంబర్ 159 బూత్ లెవెల్ అధికారి సునీతలు కూడా అవార్డు అందుకోనున్నారు. కలెక్టర్ అవార్డుకి ఎంపికవడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.