ఆడపిల్లలు స్వయం శక్తితో అన్ని రంగాలలో అభివృద్ది చెందాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ లో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భ:గా చైర్ పర్సన్ మాట్లాడుతూ, 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మొట్టమొదటిగాఈ దినోత్సవాన్ని ప్రారంభించగా.. అప్పటినుంచి జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చాయని, ప్రస్తుత భారత ప్రధాని “బేటి బచావో బేటి పడావో” అనే పథకాన్ని ప్రారంభించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంచాలకులు మాదవి, శిశు సంక్షేమ శాఖ ప్రోగ్రాం డైరెక్టర్ వెంకటేశ్వరి, చైల్డ్ వెల్పేర్ కమిటీ మెంబరు రాధా, బాలల హక్కు కమిషన్ మెంబెర్స్ జి సీతారాం, హైమావతి, 5వ స్దాయి సంఘం స్త్రీ సంక్షేమ, రక్షణ చైర్ పర్సన్ అనురాధ, జిల్లా బాలల సంరక్షణాధికారి మోకర రమేష్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రసాద్, కార్పొరేటర్ నారాయణరావు, వివిధ పాఠశాల నుంచి బాలికలు, ఉపాధ్యాయులు, తదితర అధికారులు పాల్గొన్నారు.