ఉదయం 62.55-మధ్యాహ్నం 73.76%
Ens Balu
1
Vizianagaram
2020-09-24 16:17:29
విజయనగరంజిల్లాలో గ్రామ వార్డు సచివాలయ రాతపరీక్షల్లో భాగంగా ఐదోరోజు గురువారం ఉదయం జరిగిన రాతపరీక్షకు 62.53 శాతం అభ్యర్ధులు హాజరయ్యారు. వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుకు ఐదోరోజు ఉదయం రాతపరీక్ష ఎం.ఆర్.ఆటానమస్ కళాశాల కేంద్రంలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 403 మంది అభ్యర్ధులు హాజరు కావలసి వుండగా 252 మంది హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయినట్టు జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు తెలిపారు. కోవిడ్ లక్షణాలు గల వారెవ్వరూ పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు. కాగా మధ్యాహ్నం జరిగిన ఎ.ఎన్.ఎం., వార్డు హెల్త్ సెక్రటరీ పోస్టులకు జరిగిన రాతపరీక్షకు 73.76 శాతం మంది అభ్యర్ధులు హాజరైనట్లు తెలిపారు. నగరంలోని ఐదు కేంద్రాల్లో ఈ పరీక్షకు 1982 మంది అభ్యర్ధులు హాజరు కావలసి వుండగా 1462 మంది హాజరయ్యారని, 520 మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలు గల అభ్యర్ధులు ఎవరూ పరీక్షకు హాజరు కాలేదని వెల్లడించారు.