డా.బి.ఆర్.అంబేత్కర్ కోనసీమ జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేం దుకు వైద్య ఆరోగ్యశాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా వైద్యసేవల సమన్వయ అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆర్ సి హెచ్ నమోదు, మాతా శిశు మరణాలు గర్భిణీలు నమోదు బాలింతలు గర్భిణీలు చిన్నారులలో పోషకాహార లోపాలు ఆసుపత్రులలో పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల పురోగతి పై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు మరణాల రేటును తగ్గించడంలో వైద్యులు కీలకంగా వ్యవహరించి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుండి ఏఎన్ఎం సంబంధిత వైద్యాధికారి ప్రతి నెల రెగ్యులర్గా గర్భిణీ ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించడం తోపాటు ప్రసవ ప్రణాళిక కొరకు నివేదిక రూపొందించి సుఖ ప్రసవం జరిగేట్టు జాగ్రత్తలు పాటించాలన్నారు. కాన్పు ప్రమాదకరమైన భావించిన కేసుల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ఒక్కొక్క వైద్యుడు 15 మంది గర్భిణీలను ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భం దాల్చిన మహిళ తమ పుట్టింటికి కాన్పు నిర్వహించు కునేందుకు వెళ్లిన సందర్భంలో స్థానిక వైద్యులతో కూడా రెగ్యులర్గా ఆమె ఆరోగ్య స్థితిగతులపై మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తల్లులు చిన్నారులకు పాలు పట్టే విధానంపై కూడా తగు సూచనలు వైద్యులు ఏఎన్ఎంలు చేయాలన్నారు. గర్భిణీలు కాన్పు నిర్వహణ సందర్భంలో చనిపోయినట్లయితే చనిపోవడానికి గల కారణాలను అన్వేషించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇకపై తరచుగా ఆసుపత్రులలో తనఖి నిర్వహిం చడం జరుగుతుందని తనిఖీలకు వెళ్లిన సందర్భంలో పెనాయిల్ వాసన తప్ప వేరే వాసన రాకూడ దని పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర డి సి హెచ్ ఎస్ పద్మశ్రీ రాణి ఇతర వైద్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.