సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర
పరిశ్రమలు, పెట్టుబడులు, ప్రాధమిక వసతులు, వాణిజ్యం, ఐటి శాఖా మంత్రి గుడివాడ అమర్నాధ్ తెలిపారు. బుధవారం హోటల్ నొవాటెల్ లో గ్లోబల్ ఇన్వష్టర్స్
సమ్మిట్ 2023 సదస్సు నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏపీ ఆర్.కరికల్ వలవెన్, పరిశ్రమల
డైరక్టర్ జి.సృజనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో
సదస్సును నిర్వహించాలని నిర్ణయించామన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13
రంగాలలో పారిశ్రామికవేత్తలకు గల అవకాశం గుర్తించామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఎం .ఎస్.ఎం ఇ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు.
పారిశ్రామిక వర్గాలందరిని సంప్రదించి కొత్త పాలసీను తీసుకు వస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వేత్తలను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్
చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఎం .ఎస్.ఎం .ఇ రంగానికి అధిక ప్రాదాన్యత ఇస్తున్నామన్నారు. రాబోయే జి-20 సదస్సుకు ఇది ఎంతగానో
ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ కల్పనకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సదస్సుకు దేశ , విదేశాల
నుండి ప్రతినిధులు వస్తున్నట్లు తెలిపారు. ఏపీలో పరిశ్రమలు నడిపేందుకు ఉన్న అనుకూలతలను, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహకాలను వివరించి పెట్టుబడులను
ఆకర్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రోడ్ షోలను నిర్వహించబోతున్నట్లు మంత్రి అమర్నాథ్ వివరించారు.
అగ్రికల్చర్, పుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పెస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్ టైల్స్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ ఇన్ ఫ్రాస్టక్చర్, పెట్రోలియం అండ్ పెట్రోలియం కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, టూరిజం, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ వంటి 13 రకాల రంగాలకు సంబంధించిన కంపెనీలను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో యువతి యువకులకు ఉద్యోగ కల్పనకు ఈ సదస్సు ఎంతో
ఉపయుక్తమని అన్నారు. ఆర్.కరికల్ వలవెన్ , స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏపీ మాట్లాడుతూ. విశాఖ వేదికగా మార్చి నెలలో రెండు అంతర్జాతీయ సదస్సులు
నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరం విశాఖ అని పేర్కొన్నారు. అంతకు ముందు వివిధ రంగాలకు చెందిన
పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి.రవీంద్రనాథ్ చైర్మన్ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్, కె.వెంకట రెడ్డి చైర్మన్.
మారిటైం బోర్డు , బి.ఎస్ నాగేంద్ర పుణ్యశీల. ఛైర్పర్సన్ APIDC, బి.విజయలక్ష్మి ఛైర్పర్సన్ హ్యాండీక్రాఫ్ట్స్, పాల్గొన్నారు.