అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా, ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ విశాఖపట్నం చాప్టర్, సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్‌తో కలిసి విజ్ఞాన్ కాలేజీలో ‘ఇన్వెస్ట్ ఇన్ పీపుల్ అండ్ ప్రయారిటైజ్ ఇన్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. కార్పొరేట్ ట్రైనర్, సీఆర్టీ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ ప్రవీణ్ కుమార్ 4టీస్`టీమ్ ఎడ్యుకేషన్, టైమ్ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఐఎస్టీడీ చైర్మన్ డాక్టర్ ఆర్.ఎం.రావు, సాఫ్టెక్ సొల్యూషన్స్ సీఈవో సునీల్ పుప్పాల, విజ్ఞాన్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.అరుంధతి, రెక్టార్ డాక్టర్ వి.మధుసూధన్ రావు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందించడం, నిజ జీవితంలో ఆచరణాత్మకంగా వర్తించే విషయాలపై అవగాహన కల్పించారు.