విజయనగరం జిల్లాలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో 74వ గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా వైస్ ఛాన్సలర్ ఆచార్య తేజస్వి కట్టిమని మువ్వన్నెల జండాను ఎగురవేసి, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత దేశం పుణ్యభూమి అని ఈ రోజు మనం ఆస్వాదిస్తున్న ఈ స్వాతంత్య్రం ఎందరో త్యాగ ధనుల కృషికి నిదర్శనమని కొనియాడారు. యువత తమ సామర్ధ్యాలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యాక్రమంలో విద్యార్థులు,అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.