విజయనగరంజిల్లా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏర్పాటుచేసిన ఫిష్ఆంధ్రా(మినీ) రెడీ టూ ఈట్ స్టాల్ కు విశేష స్పందన వచ్చింది. మత్స్యకారులను ఆర్ధికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఈ ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్ లను నెలకొల్పుతున్నారు. జిల్లాలోని మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ లో తాజామత్స్య ఉత్పత్తులను వేడుకలకు వచ్చినవారంతా ఆశక్తిగా తిలకించడంతోపాటు, అక్కడ ఏర్పాటు చేసిన రెడీ ఈట్ ఫుడ్ ను రుచిచూశారు. 2 గంటల్లో సుమారు రూ.7వేల వరకూ అమ్మకాలు జరిపారు. ఆస్టాల్ వద్దే జనం భారీగా గుమికూడి కొనుగోలు జరపడం విశేషం.