విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారిని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అభినందించారు. 74వ గణతంత్ర దినోత్స వేడుకల్లో మత్స్యశాఖ తరపున శకటం ఏర్పాటు, ఫిష్ ఆంధ్రా(మినీ) రెడీ టూ ఈట్ స్టాల్ నిర్వహణ చక్కగా చేపట్టడంతో కలెక్టర్ నిర్మల కుమారిని అభినందించారు. మెమోంటోతో సత్కరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లను నెలకొల్పడంతో విజయనగరం జిల్లా ముందు వరసలో నిలబడే విధంగా పనిచేసి జిల్లాకు పేరుతేవాలని సూచించారు. దానికి ప్రతిగా నిర్మలకుమారి ప్రభుత్వ లక్షాలను అధిగమించేందుకు టీమ్ వర్క్ తో పనిచేస్తామని కలెక్టర్ కి వివరించారు.