అక్రమ ఇసుక రవాణాపై కొరడా..జెసి


Ens Balu
1
Anantapur
2020-09-24 16:36:55

అనంతపురం జిల్లాలోఅక్రమంగా ఇసుకను రవాణా చేయకుండా  పటిష్టచర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ( రైతు భరోసా కేంద్రాలు మరియు రెవిన్యూ ) నిశాంత్ కుమార్  అధికారులు ఆదేశించారు.గురువారం ఉదయం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖాధికారులతో జిల్లాలో కొత్తగా ఇసుక రీచ్ ల ఏర్పాటు విషయమై జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ , జిల్లాలో అక్రమంగా ఇసుకను రవాణా చేయకుండా  పటిష్టచర్యలు చేపట్టాలని  సంబంధిత అధికారులను  ఆదేశించారు. ముఖ్యంగా మూడవ శ్రేణి వాగులు మరియు వంకలలో సంబంధిత అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించాలన్నారు . అలాగే తహాశిల్దార్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసి నిల్వ ఉంచిన ఇసుక పరిమాణం యొక్క వివరాలను సేకరించాలన్నారు.  అనంతరం పలు ప్రాంతాలలో కొత్తగా ఇసుక రీచ్ ల ఏర్పాటుకు  సంబంధించి అనుమతులను మంజూరు చేశారు. కనేకల్ మండలం రచ్చుమర్రి గ్రామంలో 49 వేల క్యూబిక్ మీటర్లు ,బెలుగుప్ప మండలం నరసాపురం లో 25, 333, బ్రహ్మసముద్రం మండలం ఎనగల్లు 14, 950 ,కుర్ల కొండ 14,231 , అజయదొడ్డి 10, 360 క్యూబిక్ మీటర్లులకు అనుమతి మంజూరు చేశారు. బ్రహ్మసముద్రం మండలం , అజయదొడ్డి నది పరివాహక ప్రాంతాల్లో కొందరు వ్యవసాయం చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చినందున ఆ ప్రాంతాన్ని  వెంటనే ఖాళీ చేయించేందుకు సంబంధిత తహాశిసిల్దారు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు .  రామగిరి మండలం, పేరూరు గ్రామంలో వాల్టా చట్టం ప్రకారం ఇసుక త్రవ్వకాలకు అనుమతి ఇవ్వలేమని తెలిపారు. ముదిగుబ్బ మండలం, ఉప్పలపాడు గ్రామం  చిత్రావతి నదిలో డీసిల్టేషన్ తవ్వకాలకు గాను నాలుగు ప్రాంతాలలో సుమారు 1, 55,247 క్యూబిక్ మీటర్ల ఇసుక పరిమాణంకు మంజూరు చేశారు. పట్టా భూములకు సంబంధించి పామిడి గ్రామంలో మహబూబ్ అనే పట్టాదారుని  భూమిలో 11 ,935 క్యూబిక్ మీటర్లకు అనుమతి మంజూరు చేశారు .నీలూరు గ్రామం పామిడి మండలం లో జాబీర్ హుస్సేన్ కు సంబంధించిన భూమిలో మరియు తాడిపత్రి మండలం బొదాయపల్లి గ్రామంలోని జయచంద్రా రెడ్డి లకు సంబంధించిన భూములలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు . ఇదివరకే మంజూరు చేసిన 5 పట్టా భూములు అనగా ఎల్లనూరు మండలం, మల్లగుండ్ల గ్రామం కృష్ణ కేశవులు, రాజేంద్ర నాయుడు, పామిడి మండలం అమర్నాథ్ ,రాజ్ కుమార్ ,తాడిపత్రి మండలం లో ఆలూరు గ్రామంకు సంబంధించి మహేంద్ర భూముల్లో ఇసుక నాణ్యత సరిగా లేని కారణంగా అనుమతిని రద్దు చేసారు.  ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె వి ఆర్ కే ప్రసాద్ ,గనులశాఖ ఉపసంచాలకులు రమణా రావు ,   ఆర్ డబ్ల్యు  ఈఈ వెంకటరమణ, ఆర్టీవో మహబూబ్ బాషా, డివిజనల్ పంచాయతీ అధికారి రమణ ,అనంతపురము, తాడిపత్రి ఏడిలు  బాలాజీ నాయక్ మరియు ఆదినారాయణ,రాయల్టీ ఇన్స్పెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.