జగనన్న పచ్చతోరణానికి అధిక ప్రాధాన్యత..
Ens Balu
3
Vizianagaram
2020-09-24 16:38:56
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న పచ్చతోరణంకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. ఈ పధకం అమలులో రాష్ట్రం లో జిల్లా ప్రధమ స్థానం లో నిలిచిందని, అయతే కొన్ని శాఖలు కనీస లక్ష్యాలను కూడా చేరుకోలేదని వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో తక్కువ మొక్కలు వేసిన శాఖాధికారులతో సమావేశం నిర్వహించి వారికి లక్ష్యాలను చేరుకోనేందుకు వివరణ కోరారు. ఈ నెల 19 న అధికారుల వాట్సప్ గ్రూప్ లో అధికారులందరికీ తమ లక్ష్యాలను సాధించేలే మొక్కలు నాటాలని సందేశం పంపడం జరిగిందని , అయితే కొన్ని శాఖలు మాత్రమే స్పందించి బాద్యత గా పని చేసి మొక్కలు నాటడం వల్లనే రాష్ట్రం లో మొదటి స్థానం లో నిలిచామని అన్నారు. స్పందించిన వారిలో బి.సి సంక్షేమం, మార్కెటింగ్ ఎ.డి., సోషల్ ఫారేస్ట్రీ , పొల్యూషన్ కంట్రోల్ శాఖ, మున్సిపాలిటీ లు ఉన్నాయన్నారు. తక్కువ సాధించిన వారిలో వైద్య ఆరోగ్యం, వ్యవసాయ, గనులు, భూగర్భం, పరిశ్రమలు, హౌసింగ్ తదితర శాఖలు ఉన్నాయన్నారు. మొక్కలు నాటిన వారు కూడా పోర్టల్ నందు అప్ లోడ్ చేయకపోవడం వలన వెనుకబడి ఉన్నారని అన్నారు. వెంటనే అప్ లోడ్ చేయాలని, ఈ వర్షా కాలం లోనే మొక్కలు బతుకుతాయని, ప్రతి శాఖా తన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించడం జరుగుతుందని, వెనకబడిన వారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి అధికారి కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశం లో సామజిక అటవీ అధికారి జానకి రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రమణ కుమారి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆశా దేవి, హౌసింగ్ పి.డి. రమణ మూర్తి, గనుల శాఖ ఎ.డి. విజయ లక్ష్మి తదితరులు హాజరైనారు.