కర్ణాటకలోని భాగళ్ కోటకు చెందిన శ్రీ సాయి అగ్రికల్చర్ ట్రేడర్స్ నిర్వాహకులు రూ.6.25 లక్షల విలువైన ట్రాక్టరును శుక్రవారం టిటిడికి విరాళంగా అందించారు. శ్రీవారి ఆల యం ముందు కొత్త వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం దాతలు టిటిడి తిరుమల డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ జానకిరామిరెడ్డికి వాహనతాళాలు అందజేశా రు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతకు టిటిడి అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.