హెల్త్ సెక్రటరీ గ్రేడ్-3 పరీక్షకు 1184 హాజరు..


Ens Balu
2
Srikakulam
2020-09-24 18:41:24

శ్రీకాకుళం జిల్లాలో గ్రామసచివాలయాల కోసం నిర్వహించిన  ఎ.ఎన్.ఎం./వార్డు హెల్త్ సెక్రటరీ గ్రేడ్-3 ప్రవేశ పరీక్షకు 1184 మంది అభ్యర్ధులు హాజరయినట్లు  జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ రిక్రూట్ మెంట్ 2020 పరీక్షలలో భాగంగా ఎ.ఎన్.ఎం./వార్డు హెల్త్ సెక్రటరీ గ్రేడ్-3 ప్రవేశ పరీక్ష గురువారం  జరిగింది.  గురువారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ పరీక్షకు 1184 మంది హాజరయినారని, 424 మంది అభ్యర్ధులు గైర్హా జరయినారని తెలిపారు.  ఈ పరీక్ష నిమిత్తం మొత్తం 1608 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, 74   శాతం హాజరైనారని తెలిపారు.  వీరిలో కరోనా పేషెంటు ఒకరు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. అభ్యర్ధులకు పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ మీడియాకి వివరించారు. 26వ తేది వరకూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు.