కోవిడ్‌పై అవగాహనలో ఎన్‌ఎస్‌ఎస్ భాగం కావాలి..
Ens Balu
1
Andhra University
2020-09-24 18:45:23
కోవిడ్‌పై అవగాహన కల్పించడంలో జాతీయ సేవ పథకం వలంటీర్లు భాగం కావాలని ఆంధ్రాయూనివర్శిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం తన కార్యాలయంలో యూనిసెఫ్(హైదరాబాద్) మంజూరు చేసిన నూతన ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ అవగాహనతో కోవిడ్‌ను అరికట్టాలని సూచించారు. యూనిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని వివిధ వర్గాల ప్రజలకు కోవిడ్‌పై విస్తృత అవగాహన కల్పించనున్నారు. కళాశాలతో సమన్వయం చేస్తూ సమాజంలో అన్నివర్గాలను భాగం చేయాలని వీసీ సూచించారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వలంటీర్లకు వీసీ ప్రసాద రెడ్డి హైజీన్ కిట్లను పంపిణీ చేశారు. వర్సిటీ పరీక్షల కేంద్రాలవద్ద సైతం కోవిడ్ అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని వీసీ సూచించారు. జాతీయ సేవాపథకం సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్ మాట్లాడుతూ నగరంలో 5 కళాశాలలకు చెందిన 120 వలంటీర్లు పాల్గొనడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇటిఐ సమన్వయకర్త డాక్టర్ పి.రామ చంద్రరావు, పోగ్రాం అధికారులు పి.రోజ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.