అనంతపురం జిల్లాలో రథసప్తమి సందర్భంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారు సూర్యప్రభ, హనుమ, గరుడ వాహనాలపై విహరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, మాజీ చైర్మన్ అశోక్, అర్చకులు ద్వారాకనాథ్, బాలాజీ స్వాములు పాల్గొన్నారు.