అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా ప్రత్యక్ష దైవాన్ని దర్శించు కోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంద్రి డా.సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి ఆయన స్వామివారిని దర్శించు కున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. నేడు సూర్య భగవానుడు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారని, రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అని వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.