"శిలంబం" విజేతలకు కలెక్టర్ ప్రశంస..


Ens Balu
1
కలెక్టరేట్
2020-09-24 18:54:51

చెన్నైలో జరిగిన మొదటి అంతర్జాతీయ శిలంబం (కర్రసాము) టోర్నమెంట్ 2020 లో పతకాలను సాధించిన నగరానికి చెందిన బాలదేవ్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ప్రశంసించారు.  మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన వారికి ఈ ప్రశంసాపత్రాలను అందజేశారు. శిలంబం టోర్నమెంట్లో బాలదేవ్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు ఎనిమిది స్వర్ణ, మూడు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఒంటి కర్ర రెండు కర్రల తో చేసే విన్యాసాలలో కె.సత్య శ్రీకాంత్ విభాగంలో రెండు  స్వర్ణ పతకాలు, డి. మహేశ్వరరావు 2 బంగారు పతకాలు సాధించగా డబల్ స్టిక్ లో 3 స్వర్ణ పతకాలు బి. కీర్తిక, పి ధరణి వర్ష, పి.యశ్వంత్ లు తలా ఒక బంగారు పతకం గెలుచుకున్నారు. సింగిల్ స్టిక్ విభాగంలో బి. సంధ్యారాణి బంగారు పతకం సాధించారు. డబల్ స్టిక్, సింగిల్ స్టిక్  రెండు  పోటీలలో  యశ్వంత్ రెడ్డి 2 కాంస్య పతకాలను సాధించారు. విశాఖ పోర్టు ఉద్యోగి బి. లక్ష్మణ్ దేవ్ శిక్షణలో వీరు ఈ టోర్నమెంట్లో విజయం సాధించారు. ఈ పోటీలు చెన్నైలో జూలై 10 తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు జరిగాయని, 12 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారని లక్ష్మణ్ దేవ్ తెలిపారు.