దరఖాస్తులను నెలలోగా గ్రౌన్డింగ్ చేయించాలి


Ens Balu
18
Vizianagaram
2023-01-28 12:28:46

పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులను నెల రోజుల్లోగా గ్రౌన్డింగ్ జేరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు.  సంబంధిత శాఖల అధికారులు  దరఖాస్తులను గడువు లోగానే పరిష్కరించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో  జిల్లా స్థాయి  పరిశ్రమల ప్రోత్సాహక  కమిటీ సమావేశం  కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ  ఫుడ్  ఉద్యాన శాఖ, మత్స్య శాఖల ద్వారా  పి.ఎం.జి.ఎస్.వై క్రింద యువత కు  అవకాశాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అక్టోబర్ నుండి జనవరి వరకు 104 దరఖాస్తులు  అందగా 82  దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, కాలుష్య నియంత్రణ శాఖ వద్ద 19 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని,  3 దరఖాస్తులు తిరష్కరించడం జరిగిందని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పాపా రావు  వివరించారు.

 కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను నేరుగా తిరష్కరించవద్దని,దరఖాస్తు లోని లోపాలను సవరించి తిరిగి సమర్పించమని చెప్పి, అందుకు తగు సలహాలను  అందించాలని సూచించారు.  ఎస్.సి., ఎస్.టి, మహిళల కు సబ్సిడీ 35 నుండి 45 శాతం వరకు ఉందని, అవగాహన కలిగించి ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని తెలిపారు. మాల్స్ , దుకాణాల్లో భద్రతా తనిఖీలు:  వినియోగదారులకు కనీస భద్రత ఉండేలా  దుకాణాల్లో మాల్స్ లో భద్రతా అంశాలను తనిఖీ చేసి ఆడిట్ నివేదిక నందించాలని ఆదేశించారు. అగ్నిమాపక, లేబర్, మున్సిపల్ శాఖల వారు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్  ద్వారాలు వేర్వేరుగా ఉండాలని, ఫైర్ సామాగ్రి, అత్త్యవసర ద్వారాలు  ఉండాలని, నిబంధనలను పాటించని వాటి లైసెన్స్ రద్దు చేయాలనీ అన్నారు. సమావేశం లో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస రావు, జిల్లా అధికారులు, ఎపిఐఐసి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.