స్పోర్ట్స్ ఎరీనా డిసెంబరు నాటికి పూర్తికావాలి..


Ens Balu
3
Visakhapatnam
2020-09-24 19:14:35

విశాఖలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో నిర్మిస్తున్న ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా పనులు డిసెంబర్ నెలాఖరకు పూర్తి చేయాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా.జి.సృజన అధికారు లను ఆదేశించారు. గురువారం స్విమ్మింగ్ పూల్ వద్ద జరుగుతున్న పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లోరింగుకు వినియోగిస్తున్న సింథటిక్ మరియు ఉడెన్ మెటీరియల్ నాణ్యతను పరిశీలించారు. నిర్మాణానికి సంబందించి గోడలు, స్లాబుకు వేస్తున్న సీలింగ్ మెటీరియల్ ను ఎంపిక చేసారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉండాలని గుత్తేదారును ఆదేశించారు. తదుపరి ఆమె, 68వ వార్డులో 29 లక్షలతో నిర్మించబోతున్న రీటైనింగ్ వాల్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి గోడ నిర్మించుటకు అనుమతి మంజూరు చేసారు. 6వ జోన్ లో పట్టణ ప్రణాళికా విభాగపు అధికారుల ప్రతిపాదనలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, శివప్రసాద్ రాజు, కార్యనిర్వాహక ఇంజినీర్ సుధాకర్ మరియు 6వ జోన్ పట్టణ ప్రణాళికా విభాగపు అధికారులు, ఏ.సి.పి. భాస్కరబాబు తదితరులు పాల్గొన్నారు.