విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ప్రసంగించారు. మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోస్ నుద్దేశించి, ఆమె స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సిటిజెన్ చార్టర్ అమలుకు సంబంధించిన అంశాలను వివరించారు. ప్రభుత్వ శాఖల పనితీరు, కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారుల పాత్ర, పరిశోధనా విద్యార్థుల పాత్ర, వారు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలను, వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఐఐఎం ఎంజిఎన్ఎఫ్ ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ మొహ్మద్ షమీమ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంజీఎన్ఎఫ్ ఫెలో సుశాంత్ తో పాటు సుమారు 60 మంది సహచర విద్యార్ధులు పాల్గొన్నారు.