విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనవరి 31న జరగాల్సిన జిల్లా సమీక్ష సమావేశం వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా సమీక్ష సమావేశం వాయిదా వేస్తూ జిల్లా ఇన్ చార్జి మంత్రి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సమావేశం జరిగే తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈలోగా జిల్లా అధికారులు సమస్త సమాచారంతో సిద్దంగా ఉండాలన్నారు.