సివిల్స్ అభ్యర్ధుల కోసం ప్రత్యేక రైలు నడపండి..
Ens Balu
3
Vizianagaram
2020-09-24 19:28:19
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష హాజరయ్యే ఉత్తరాంధ్ర ప్రాంత అభ్యర్థుల సౌకర్యార్థం ఇచ్ఛాపురం నుండి విశాఖపట్నం వరకూ ఒక ప్రత్యేక రైలు నడపాలని పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కోస్తా రైల్వే లోని విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్ ను కోరారు. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3, 4 తేదీల్లో జరగనుందని, రెగ్యులర్ రైళ్లు నడవని పరిస్థితిలో ఈ పరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రత్యేక రైలు నడపాలని డి.ఆర్.ఎం. చేతన్ కుమార్ శ్రీవాత్సవ ను కోరుతూ ఎం.పి. గురువారం ఒక లేఖ రాశారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి బస్సుల సౌకర్యం తక్కువగా సమయంతో రైల్వే ప్రత్యేక రైలు వేయడం ద్వారా అభ్యర్ధులకు మేలు జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్రా నుంచి చాలా మంది అభ్యర్ధులు ఈ దఫా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాస్తున్నందున రైల్వే అధికారుల వారికోసం ఆలోచించాలని కోరారు.