ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవ జ్యోతి, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు చరిత్రను పెడచెవిన పెట్టిందని జనసేన అరకు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్రజి వంపూరు గంగులయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన అరకులో మీడియాతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజనలో అల్లూరి పేరుని పాడేరు జిల్లాకు పెట్టిన ప్రభుత్వం ఆయన చరిత్రను పట్టించుకోవడం మానేసిందన్నారు. అల్లూరి సంచరించిన ప్రదేశాలను ఒక సెంట్రల్ థీమ్ ప్రాజెక్టుగా చేయడం ద్వారా అల్లూరి కోసం భావితరాల గిరిజనులకు తెలుస్తుందని, అంతేకాకుండా ఈప్రాంతం పర్యాటక పరంగా అభివ్రుద్ధి చెందుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు ఉమ్మడి విశాఖజిల్లాలోని మన్యం వేదికగా తన పోరాటం చేశారని, ఆయన పోరాటాలు చేసిన ప్రతీప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాది దొరుకడంతోపాటు, అల్లూరి చరిత్ర భాహ్య ప్రపంచానికి తెలుస్తుందని, ఈవిషయమై ప్రభుత్వం తక్షణమే నిర్ధిష్ట ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.