గోరక్షణను ప్రతీ ఒక్కరూ భాద్యత చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సింహాచలం శ్రీకృష్ణాపురం లోని దేవస్థానం నృసింహ వనం, గోశాలలో నూతనంగా నిర్మించిన షెడ్డును ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గో రక్షణ వలన లోకం శుభిక్షంగా ఉంటుందన్నారు. ఇంత పెద్దమొత్తంలో గోశాలను నిర్వహిస్తున్న దేవస్థానాన్ని ఆయన అభినందించారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేవస్థానంలో జరిగే పనులను వివరించారు. 30 అడుగుల వెడల్పు, 90 అడుగుల పొడవు ఉన్న షెడ్ నిర్మాణానికి రూ.15 లక్షలు ఖర్చయిందని.. సింహాచలేశుని దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యుడు సంపంగి శ్రీవాసరావు ఈ వ్యయాన్ని అందించారు. గోవుల రక్షణార్ధం ఈ షెడ్ వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో త్రినాథరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు, ఈఈ శ్రీనివాసరాజు, ఏ. రాంబాబు, ఏ ఈవోలు ఇజ్జురోతు శ్రీనివాసరావు, విబివి. రమణమూర్తి, నరసింహరాజు,ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వైసీపీ నేత కేకే.రాజు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.