స్పందన లాగిన్ లో వచ్చిన వినతులను ఆయా శాఖల అధికారులు 24 గంటల్లో ఓపెన్ చేసి చూడాలని, అలా చూడని వారి పై క్రమశిక్షణా రాహిత్యం గా పరిగణించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని డి.ఆర్.ఓ గణపతి రావు తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో స్పందన ఆడిట్ టీం తో సమావేశం నిర్వహించారు. స్పందన కార్యక్రమం ఇక పై జగనన్నకు చెపుదాం గా మార్పు జరిగిందని, ఈ కార్యక్రమాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పర్యవేక్షిస్తారని తెలిపారు. అధికారులు స్పందన లాగిన్ లో వచ్చిన దరఖాస్తు తన పరిధి లో ఉంటే ఎస్ అని క్లిక్ చేసి ఎంకవైరీ అధికారికి పంపాలని , తన పరిధి లో కానిదైతే నో క్లిక్ చేసి స్పందన టెక్నికల్ టీం కు ఆన్లైన్ లో పంపాలని తెలిపారు. అదే విధంగా పరిష్కరించె అధికారి ఎంక్వయిరీ రిపోర్ట్, ఫోటో ను సరి చూసుకోవాలన్నారు. స్పందన పరిష్కారం పై పిటిషన్ దారు అసంతృప్తి వ్యక్తం చేస్తే జిల్లా స్థాయి ఆడిట్ కమిటీ విచారణ చేసి మరల రెడ్రెస్సల్ చేయాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా పరిషత్ సి.ఈ.ఓ డా.అశోక్ కుమార్, సి.పి.ఓ బాలాజీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.