విజయనగరంజిల్లాలోని కేంద్ర గ్రంథాలయం, గ్రామీణ గ్రంథాలయాల నిర్వహణ నిమిత్తం అవసరమైన సామాగ్రి కొనుగోలుకు కమిటీ ఆమోదం తెలిపిందని ఈ మేరకు ఆసక్తి కలిగిన సరఫరాదారుల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్. లలిత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫర్నీచర్, జెరాక్స్ మెషీన్లు, ప్రింటింగ్ రిజిస్టర్లు సరఫరా చేయుటకు ముందుకొచ్చే వారు www.apeprocurement.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ-టెండర్లు దాఖలు చేయాలని సూచించారు. సంబంధిత వివరాలను టెండరుదారుల పరిశీలనార్థం ఈ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్లో ఫిబ్రవరి 4 నుంచి పది రోజుల పాటు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.