సామాజిక భాద్యతతో ప్రతీఒక్కరు సేవాకార్యక్రమాలు చేపట్టి, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ ఆ డబ్బును సమాజానికి ఉపయోగపడే పనులకు న్యూ హోప్ ఫౌండషన్ వ్యవస్థాపకులు మల్లీశ్వరి లాంటివారు కొందరే ఖర్చు చేస్తుంటారని అన్నారు. ఇలా సేవలు అందించిన వారిని సంస్థ ఆధ్వర్యంలో వంశీ ఘనంగా స్కరించారు. విశాఖలోని న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం వారియర్ అఫ్ ది ఇయర్ అవార్డ్స్ లను ప్రధానం చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, వివిధ రంగాలలో ప్రతిభ కనభరిచిన వారిని గుర్తించి సత్కరించడం అభినందనీయం అన్నారు. అవార్డు గ్రహీత వి.జె.ఎఫ్ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సామాజిక సేవా రంగంలో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు ఇవ్వడం అభినందనీయమన్నారు.
భవిష్యత్తులో ఈ ఫౌండేషన్ మరెన్నో మంచి కార్యక్రమాలను చేపట్టాలని అభిలాషించారు. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లీశ్వరి మాట్లాడుతూ, తమ ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తాము చేస్తున్న మంచికార్యక్రమాలకు ప్రజల నుంచికూడా అనుహ్య స్పందన వస్తుందన్నారు. సేవే ధ్యేయంగా తమ ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పారు. పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి హాజరైన అతిధులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జీవీఎంసీ సిబ్బందికి, జర్నలిజం లో పనిచేస్తున్న ప్రముఖులకు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అతిధుల ఈ అవార్డులను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట శ్రీనివాస్,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.