విజయనగరంజిల్లా ఖజానా, లెక్కల అధికారిగా రుద్రపాటి అశోక్ సమర్పణ కుమార్, సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లా ఖజానా అధికారిగా ఉన్న ఎస్ఆర్‌కె గణేష్ అనారోగ్య కారణాలతో సెలవు పెట్టడంతో, ఉమ్మడి జిల్లా ఖజానా అధికారిగా అశోక్ సమర్పణ కుమార్ పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అశోక్‌కుమార్‌కు, ఎపిటిఎస్ఎ నాయకులు, ఖజానా కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఖజానా అధికారులు నితిన్, ఆదిత్య, ఎపిటిఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి పద్మనాభం, జిల్లా కార్యవర్గ సభ్యులు సరేష్, సంతోషి, రామకృష్ణ, చంద్రశేఖర్, నాగమునిరెడ్డి పాల్గొన్నారు.