రోగి సహాయకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి


Ens Balu
12
Visakhapatnam
2023-02-13 10:14:46

ప్రతి రోజు వైద్యం కోసం కె.జి.హెచ్ కు వచ్చే రోగులతో పాటు వారి సహాయకులకు విశ్రాంతి తీసుకునేలా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున కెజిహెచ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ కె.జి.హెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొత్తగా ఏర్పాటు చేసిన 200 పడ కల ఉచిత వసతి భవనాన్నిపరిశీలించారు. అదే విదంగా ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే రోగుల సహాయకులకు విశ్రాంతి తీసుకొనేందుకు వెయిటింగ్ హాలు ఏర్పాటు చేయా లని సూచించారు.  కె.జి.హెచ్ పరిపాలన భవనానికి ఎదురుగా ఉన్న స్థలంలో పార్కును అభివృద్ది చేసి వాటర్ పౌంటేన్ తో పాటు  కూర్చుకొనేందుకు బల్లలు ఏర్పాటు చేయాల న్నారు.  కె.జి.హెచ్ ప్రవేశ ద్వారానికి ఆర్చ్ ఏర్పాటు చేసి  ప్రక్కనే ఉన్న పార్కింగ్ స్థలాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  కె.జి.హెచ్ సూపరిం టెండెంట్ డా.అశోక్ కుమార్, ఎ.పి.ఎం.ఐ.డి.సి ఈఈ నాయుడు, డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.